ములుగు ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలు

  • Published By: murthy ,Published On : October 19, 2020 / 11:30 AM IST
ములుగు ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలు

Updated On : October 19, 2020 / 12:27 PM IST

maoists : మంగపేటలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఫొటోలతో పాటు ఒక ప్రకటన విడుదల చేశారు.



ఆదివారం నరసింహసాగర్‌ అటవీప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని మావోయిస్టులు మరణించారు.వీరిని గుర్తించడం కోసం ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌లోని మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బంధువులతో పాటు ఎవరైనా మృతదేహాలను గుర్తిస్తే ములుగు జిల్లా పోలీసులను సంప్రదించాలని కోరారు. కంట్రోల్‌ రూమ్‌ 7337029296, ఎస్పీ కార్యాలయం 08715-295100, ఏటూనాగారం ఏఎస్పీ కార్యాలయం 7901141447 నంబర్లలో సంప్రదించాలని కోరారు.