పగలు రెండో భార్య దగ్గర… నైట్ డ్యూటీల పేరుతో మొదటి భార్య దగ్గర

  • Published By: murthy ,Published On : July 18, 2020 / 01:13 PM IST
పగలు రెండో భార్య దగ్గర… నైట్ డ్యూటీల పేరుతో మొదటి భార్య దగ్గర

Updated On : June 26, 2021 / 11:48 AM IST

చదువుకోడానికి హైదరాబాద్ వచ్చిన యువతికి… తనకి పెళ్ళికాలేదని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసాక ఆమెను వదిలి పారిపోయాడో వ్యక్తి. దీంతో ఆమె ఇరుగు పొరుగువారి సహాయంతో ఆస్పత్రిలో చేరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాళి కట్టినవాడు ఎప్పుడొస్తాడా ఎని ఎదురు చూస్తోంది. మహాంకాళి పోలీసులు, బాధితురాలు తెప్పిన వివరాల ప్రకారం..

గుంటూరుకు చెందిన ఎస్ కే షబీనా (25) కొన్నేళ్ళ క్రితం చదువుకోటానికి హైదరాబాద్ వచ్చి ఈసీఐఎల్ ఏరియాలో నివసించేది. అక్కడే ఒక స్నేహితురాలి ద్వారా అవుసరి సంపత్(29) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్నాళ్లకు పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

తనకు పెళ్ళి కాలేదని ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు సంపత్. అతని మాటలు నమ్మిన ప్రియురాలు షబీనా …2018 , మార్చి 14 న వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత సంపత్,షబీనాలు ఆవుల మందలో ఇల్లు తీసుకుని అక్కడ కాపురం పెట్టారు. కాగా….సంపత్ కు అప్పటికే పెళ్ళై , భార్య, ఓ కుమార్తె ఉన్నారు. వారు వనస్ధలిపురంలో ఉంటున్నారు.

రెండో పెళ్లైన కొన్నాళ్లకు నైట్ డ్యూటీలు ఉన్నాయని చెప్పి సంపత్ రాత్రిపూట మొదటి భార్య దగ్గరకు వెల్లి వస్తూ ఉండేవాడు. రెండో భార్య షబీనాతో కలిసి సంపత్ మే 31న ఈసీఐఎల్ లో ఉండే స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.

పెళ్లిచేసుకున్న విషయం మిత్రుడికి చెప్పాడు. ఈ విషయం స్నేహితుడు సంపత్ మొదటి భార్యకు చేరవేశాడు. దీంతో ఆమె, తన సోదరుడితో జూన్ 4న సంపత్ ఇంటికి వచ్చి గొడవ పడింది. దీంతో సంపత్ వారి వెంట వెళ్లి పోయాడు.

ఆ తర్వాత షబీనా దగ్గరకు రావటం కానీ ఫోన్ చేయటం కానీ చేయలేదు. దీంతో ఆమె మహంకాళి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా భర్త ఒంటరిగా వదలేసి వెళ్లటంతో బాలా నగర్ లో చిన్న గదిలో ఒంటరిగా జీవిస్తోంది. నెలలు నిండటంతో ఇంటి దగ్గర ఉన్న ఒక మహిళ సహాయంతో కోఠి మెటర్నటీ ఆస్పత్రిలో చేరి జులై9న బాబుకు జన్మనిచ్చింది.