దేశ రాజధానిలో టూరిస్ట్ గైడ్ పై గ్యాంగ్ రేప్

  • Published By: murthy ,Published On : September 21, 2020 / 05:46 PM IST
దేశ రాజధానిలో టూరిస్ట్ గైడ్ పై గ్యాంగ్ రేప్

Updated On : September 21, 2020 / 5:54 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కన్నాట్ ప్లేస్ మార్కెట్ కు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ లో ఉండే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్, టూరిస్ట్ గైడ్ గా పని చేస్తున్న ఓ మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ న్యూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.




ఆరోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తులు అత్యాచారం చేసిన హోటల్ లో రూం బుక్ చేసుకున్నారు. అదే హోటల్ లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న మహిళకు డబ్బు అవసరం ఉందని గుర్తించారు. ఆమెకు తక్కువ వడ్డీకి అప్పు ఇప్పిస్తామని చెప్పి హోటల్ గదికి రమ్మన్నారు.
https://10tv.in/husband-uploads-wife-pics-and-phone-number-in-illegal-site/
ఆమె హోటల్ గదిలోకి వెళ్లగానే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత మహిళ పిర్యాదుతో ఓ మహిళతో సహా ఆరుగురు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 376డీ, 323, 34ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడుగా భావిస్తున్న మనోజ్ శర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.