నా భార్య పచ్చి తాగుబోతు. మత్తెక్కి చితక్కొడుతోంది. సెక్యురిటీ కావాలి. పోలీసులకు ఓ భర్త మొర

‘alcoholic’ wife thrashing: గుజరాత్, అహ్మదాబాద్‌లో ఓ భర్త పోలీసుల రక్షణ కావాలని మొరపెట్టుకున్నాడు. అతని భార్యకు మందు అలవాటుంది. పెగ్గుపడితే, మత్తెక్కి అతన్ని కొడుతోందంట.
అతనికి 29 ఏళ్లు. కోక్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతనిది చిత్రమైన సమస్య. నా తాగుబోతు భార్య రోజూ కొడుతోంది. మానసికంగా హింసిస్తోంది. పెళ్లం నుంచి సెక్యురిటీ కావాలని పోలీసులను కోరాడు. పెళ్లకి ముందే రిలేషన్ ఉంది. ఈ మందుకొట్టే అలవాటు పెళ్లయిన తర్వాతే వచ్చిదంట.
మూడుపెగ్గులుపడితే చాలు, అతన్ని, అత్తామామలని బండబూతులు తిడుతుందంట. మొగున్నిపట్టుకొని కొడుతుంట. కొన్నిసార్లు పగలే మందుకొట్టి అతని ఆఫీసుకెళ్లి రచ్చచేస్తుందని ఫిర్యాదు చేశాడు.
పెళ్లాం హింస్తోంది, నన్ను రక్షిస్తోంది
పెళ్లయ్యింది. అత్తామామలను ఇంట్లోంచి వెళ్లగొట్టింది. జూన్ లో అత్తామామలకి కరోనా. చూసుకొనేవాళ్లులేక మళ్లీ కొడుకు దగ్గరొచ్చారు. అంతే వాళ్లను పట్టించుకోలేదు. చూడాలంటే ఆ ఇంటిని ఆమె పేరుమీద రాయాలంట. ఆస్తిరాయకపోలే చచ్చిపోతానని ప్రతిరోజూ హింసిస్తోందని బోరుమన్నాడు ఆ భర్త.
ఇంతా చేసి భార్యే గృహహింస కేసుపెట్టిందంట.
https://10tv.in/pune-man-arrested-for-brutally-murdering-his-wifes-social-media-buddy/