వెయ్యి కిలోల గంజాయి పట్టివేత

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 07:51 AM IST
వెయ్యి కిలోల గంజాయి పట్టివేత

Updated On : April 18, 2019 / 7:51 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇటుకల మధ్యన గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సీలేరు ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా.. పంతంగి టోల్‌గేట్ వద్ద గుర్తించిన రెవెన్యూ అధికారులు..1,121కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుపబడిన గంజాయి విలువ కోటి 68 లక్షలు  ఉంటుందని అధికారులు చెబుతున్నారు