12 arrested for prostitution : గచ్చిబౌలీలో వ్యభిచారం…ఆరుగురు యువతులతో సహా 12 మంది అరెస్ట్

హైదరాబాద్ గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న హోటల్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆరుగురువిటులను,ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా నిర్వాహకలు పరారయ్యారు.

12  arrested for prostitution  : గచ్చిబౌలీలో వ్యభిచారం…ఆరుగురు యువతులతో సహా 12 మంది అరెస్ట్

Prostitution Rocket Busted Gacchbowli

Updated On : March 26, 2021 / 11:49 AM IST

12 arrested for prostitution in raid a hotel, in Hyderabad : హైదరాబాద్ గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న హోటల్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆరుగురువిటులను,ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా నిర్వాహకలు పరారయ్యారు.

శ్రీరాంనగర్ కాలనీలోని హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు యూంటి ఉమెన్ ట్రాకింగ్ సెల్, గచ్చిబౌలీ పోలీసులు బుధవారం రాత్రి ఆ హోటల్ పైదాడి చేశారు.

ఈ దాడిలో విటులు బిజ్యూపాయల్‌(27), దీపక్‌కుమార్‌ (25), సంగం కిషోర్‌దాల్‌(24), నితిన్‌జాషన్‌ అలియాస్‌ ఆరుట్ల నిఖిల్‌ (31), బంది నారాయణ (38), వెంకటేష్‌గౌడ్‌(58)లను అరెస్ట్‌ చేశారు. వీరివద్ద నుంచి రూ.32,510 రూపాయల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు దాడి ముందుగానే పసిగట్టిన నిర్వాహాకలు ప్రభాకర్, సంజయ్, అజయ్‌ పరారీలో ఉన్నారు. కాగా…. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఒక యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. కేసునమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.