Delhiలో దారుణం : గుడ్లు తిన్నాడని బాలుడిని కాల్చేశాడు

దేశ రాజధానిలో మరో ఘోరం జరిగిపోయింది. క్షణికావేశంలో ప్రాణాలను తీసేస్తున్నారు. పట్టపగలు..నడి రోడ్డుపై పాశవికంగా హత్యలు చేస్తున్నారు. దుకాణం ఎదురుగా గుడ్లు తింటున్నాడని ఓ బాలుడిని కాల్చిపారేశారు. అయితే..ఇందులో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఇన్సిడెంట్ ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలోని జ్యోతినగర్‌లో చోటు చేసుకుంది.
జ్యోతి నగర్‌లో ప్రాంతంలో ఉమేష్ వర్మకు ఓ జ్యువల్లరీ షాపు ఉంది. దుకాణం ఎదుట 17 సంవత్సరాల మనీష్ బాలుడు తోటి స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం గుడ్లు తింటున్నాడు. ఇక్కడ ఎగ్స్ తినవద్దని ఉమేష్ వారికి సూచించారు. ఉమేష్ ఇతరులను పిలవడం…ఓ వ్యక్తి బాలుడిపై కాల్పులు జరపడం చకచకా జరిగిపోయాయి. దీనితో అక్కడికక్కడనే మనీష్ కుప్పకూలిపోయాడని డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీసు (నార్త్ ఈస్ట్) అతుల్ కుమార్ వెల్లడించారు. వెంటనే గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఛాతిలో దిగబడిన గుండును బయటకు తీసినట్లు..మనీష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ఘటనపై వర్మపై కేసును ఫైల్ చేసి అరెస్టు చేసినట్లు..దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.