Huge Explosion In Coal Mine : బొగ్గుగనిలో భారీ పేలుడు.. 25 మంది మృతి
టర్కీలోని ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, 110 మందికిపైగా గాయపడ్డారు. మరో 50 మంది గనిలో చిక్కుకుపోయారు. బొగ్గగనిలో శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వెలువడటం వల్ల పేలుడు సంభవించింది.

huge explosion in coal mine
Huge Explosion In Coal Mine : టర్కీలోని ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, 110 మందికిపైగా గాయపడ్డారు. మరో 50 మంది గనిలో చిక్కుకుపోయారు. బొగ్గగనిలో శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వెలువడటం వల్ల పేలుడు సంభవించింది.
దీంతో 25 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సుమారు 50 మంది కార్మికులు గనిలో 300 నుంచి 350 మీటర్ల దూరంలో చిక్కుకుపోయారని వెల్లడించారు.
Singareni Accident : సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు మృతి
వారిని వీలైనంత తొందరగా రక్షిస్తామని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సులేమాన్ సోయ్‌లు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మందిని బయటకు తీసుకొచ్చామని చెప్పారు.
గాయపడినవారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్ కోకా ట్వీట్ చేశారు. టర్కీలోని సోమాలో 2014లో జరిగిన బొగ్గుగని ప్రమాదంలో 301 మంది కార్మికులు మృతి చెందారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.