Tamil Nadu: స్కూలుకు వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు చిన్నారులు మృతి

తిరుపత్తూర్ జిల్లాలో, వనియంబాడి సర్వీస్ లేన్‌పై ముగ్గురు బాలలు సైకిల్‌పై వెళ్తున్నారు. విజయ్, సూర్య అనే సోదరులతోపాటు, రఫీక్ అనే మరో బాలుడు కలిపి సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక ఎస్‌యూవీ వాహనం వారిని ఢీకొంది. ఈ ఘటనలో కింద పడ్డ ముగ్గురిపై నుంచి వాహనం దూసుకెళ్లింది.

Tamil Nadu: స్కూలుకు వెళ్తున్న విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు చిన్నారులు మృతి

Updated On : March 1, 2023 / 6:17 PM IST

Tamil Nadu: కాలేజీ స్టూడెంట్ నిర్లక్ష్యం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. విద్యార్థి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల స్కూలుకెళ్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపత్తూర్ జిల్లాలో, వనియంబాడి సర్వీస్ లేన్‌పై ముగ్గురు బాలలు సైకిల్‌పై వెళ్తున్నారు.

KA Paul: సోదరుడి హత్య కేసులో సుప్రీం కోర్టుకు కేఏ పాల్.. తనను అరెస్టు చేయకుండా స్టే విధించాలని పిటిషన్

విజయ్, సూర్య అనే సోదరులతోపాటు, రఫీక్ అనే మరో బాలుడు కలిపి సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక ఎస్‌యూవీ వాహనం వారిని ఢీకొంది. ఈ ఘటనలో కింద పడ్డ ముగ్గురిపై నుంచి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలూ ప్రాణాలు కోల్పోయారు. ఎస్‌యూవీ కారు నడిపింది ఒక కాలేజ్ స్టూడెంట్‌గా తేలింది. అతడు తన స్నేహితులతో కలిసి యెలగిరి హిల్ వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి రాగానే అతివేగం కారణంగా వాహనం అందుపుతప్పింది. దీంతో సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు పిల్లల్ని ఢీకొంది.

BJP Jagtial: బీజేపీలో చేరిన జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్.. కన్నీళ్లు పెట్టుకుని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా..

ముగ్గురు పిల్లల వయసు పదమూడు సంవత్సరాలకంటే తక్కువగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ చేసిన యువకుడు ప్రమాదం జరిగిన సమయంలో మద్యం సేవించలేదని పోలీసులు చెప్పారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అతడితోపాటు స్నేహితుల్ని అరెస్టు చేశారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.