Chhattisgarh Encounter : భారీ ఎన్‌కౌంటర్.. 30కి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య..
సంఘటనా స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

Chhattisgarh Encounter : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టుల మృతుల సంఖ్య 30కి చేరింది. బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. కాంకేర్‌లో నలుగురు మావోలు మరణించారని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
సంఘటనా స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అటు నారాయణపూర్ – దంతెవాడ సరిహద్దులోని తుల్తులి ప్రాంతంలో జరిగిన IED పేలుడులో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు.
బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ మొదలైంది. గంటల పాటు కొనసాగింది. జవాన్లు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టారు.
డీఆర్ జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా అని బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.