ఘోర ప్రమాదం : స్కూల్ వ్యాన్ లో మంటలు.. పిల్లలు మృతి

పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 8మంది గాయపడ్డారు. మంటల్లో

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 10:51 AM IST
ఘోర ప్రమాదం : స్కూల్ వ్యాన్ లో మంటలు.. పిల్లలు మృతి

Updated On : February 15, 2020 / 10:51 AM IST

పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 8మంది గాయపడ్డారు. మంటల్లో

పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. 8మంది గాయపడ్డారు. మంటల్లో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. సంగ్రూర్ జిల్లా లాంగ్ వాల్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో వ్యాన్ లో 12మంది వరకు విద్యార్థులు ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవర్ 8మంది పిల్లలను కాపాడగలిగాడు. ఈ వ్యాన్.. సిమ్రాన్ పబ్లిక్ స్కూల్ కి చెందినది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

వ్యాన్ లో మంటలకు కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన పిల్లలు.. ఇక ఎప్పటికీ రారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటనతో స్కూల్ యాజమాన్యం షాక్ కి గురైంది. చనిపోయిన పిల్లల్లో నాలుగు, ఆరేళ్ల వయసు వారు ఉన్నారు.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు