Bike Riders Arrest : విశాఖలో రెచ్చిపోయిన బైక్ రైడర్స్-పోలీసుల అదుపులో 44 మంది

విశాఖపట్నంలో శనివారం రాత్రి బైక్ రేస్‌లు నిర్వహించిన ఘటనలో 44 మందిని అదుపులోకి తీసుకున్నామని విశాఖ ఏపీసీ హర్షిత చంద్ర చెప్పారు. 

Bike Riders Arrest : విశాఖలో రెచ్చిపోయిన బైక్ రైడర్స్-పోలీసుల అదుపులో 44 మంది

Vsp Bike Riders

Updated On : July 11, 2022 / 8:56 PM IST

Bike Riders Arrest :  విశాఖపట్నంలో శనివారం రాత్రి బైక్ రేస్‌లు నిర్వహించిన ఘటనలో 44 మందిని అదుపులోకి తీసుకున్నామని విశాఖ ఏపీసీ హర్షిత చంద్ర చెప్పారు.  ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ….శనివారం రాత్రి బైక్ రేసులు నిర్వహించేందుకు సుమారు 200 మంది బీచ్ రోడ్డులోకి వచ్చారని…. అక్కడ పోలీసులు   ఉండటంతో సిరిపురం,కాంప్లెక్స్,స్వర్ణభారతి స్టేడియం వద్ద బైక్ రైడ్ చేస్తు అలర్లు చేసారని చెప్పారు.

ఈ క్రమంలో స్వర్ణభారతి స్టేడియం వద్ద అడ్డు  వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను సైతం కొట్టారని ఆమె తెలిపారు.  ఇన్‌స్టాగ్రాం ద్వారా, సోషల్ మీడియా గ్రూపులు ద్వారా గ్రూపుగా ఏర్పడి ఈరేసింగ్ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ రేసింగ్ కు పాల్పడిన వారిలో ఎక్కవ మంది స్టూడెంట్స్ ఉన్నారని… కొంతమంది   ఉద్యోగస్తులు కూడా ఉన్నట్లు  గుర్తించామని ఆమె చెప్పారు. ఈ రేసింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు 13 మంది పై కేసులు నమోదు చేశామని.. నగరంలో రేసింగ్ లు జరిగే 10 ప్రదేశాలు గుర్తించినట్లు ఆమె వివరించారు.

Also Read : Viral Video : అది ఆటోనా…బస్సా…సెవెన్ సీటర్ ఆటోలో 27 మంది…