Hyderabad : 50లక్షలు అప్పులు, ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు.. హైదరాబాద్‌లో అదృశ్యమైన కుటుంబం
తమకు చావు తప్ప వేరే మార్గం లేదంటూ వరాహమూర్తి కుటుంబం సెల్ ఫోన్లు ఇంట్లోనే వదిలి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది.

Hyderabad Family Missing
ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది. హైదరాబాద్ మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. వరాహమూర్తి, దుర్గ దంపతులు కుమారుడు సత్యభైరవ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు. వరాహమూర్తి వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన వరాహమూర్తి సుమారు 50లక్షల వరకు అప్పులు చేశారు. తిరిగి చెల్లించలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు.
తమకు చావు తప్ప వేరే మార్గం లేదంటూ వరాహమూర్తి కుటుంబం సెల్ ఫోన్లు ఇంట్లో వదిలి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. కూతురు చాముండేశ్వరి మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Also Read : ఘోరాతి ఘోరం.. సాఫ్ట్‌వేర్ అమ్మాయిని సజీవ దహనం చేసిన మాజీ క్లాస్‌మెట్
వరాహమూర్తి, దుర్గ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. ముగ్గురు కూతుళ్లకు వివాహాలు చేసేశారు. స్థానిక గోల్డ్ షాప్ లో తండ్రీ కొడుకులు పని చేసే వారు. వరాహమూర్తి 50లక్షల వరకు అప్పులు చేశారు. అప్పులు పెరిగిపోవడంతో వరాహమూర్తి దంపతులు ఒత్తిడికి గురయ్యారు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో వరాహమూర్తి కుటుంబం అదృశ్యమైంది.
ఈ నెల 20వ తేదీన ఒక పేపర్ రాసి దాన్ని సెల్ ఫోన్ కింద పెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వరాహమూర్తి, దుర్గ, వారి కుమారుడు ముగ్గురూ అదృశ్యమయ్యారు. వరాహమూర్తి కూతురు చాముండేశ్వరి కొన్నిరోజులుగా తండ్రికి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికి దగ్గరికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది.
దాంతో అనుమానం వచ్చిన ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మిస్సింగ్ అయ్యారా? ఏదైనా అఘాయిత్యం చేసుకున్నారా? అనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read : తమ్ముడి భార్యపై ఘాతుకం.. పెట్రోలు పోసి నిప్పంటించిన బావ