Madhya Pradesh : తమ్ముడి భార్యపై ఘాతుకం.. పెట్రోలు పోసి నిప్పంటించిన బావ
తన తమ్ముడి చావుకి మరదలే కారణమని అనుమానించిన ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. మరదలిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమె పుట్టింటికి ఫోన్ చేసి తన నిర్వాకం చెప్పాడు.

Madhya Pradesh
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ ఇంటి కోడలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో నిర్మల అనే మహిళ మృతి చెందింది.

madhya pradesh 3
IIT Kanpur : కాన్పూర్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య
ప్రకాష్, నిర్మల భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఏమైందో ఏమో 6 నెలల క్రితం ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయినప్పటి నుండి నిర్మల తన పిల్లలతో అత్తమామల వద్ద ఉంటోంది. నిర్మల కారణంగానే ప్రకాష్ చనిపోయాడని అతని సోదరుడు సురేష్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్ మరదలిపై దాడి చేసి ఇంటి బయటకు లాగి పెట్రోలు పోసి నిప్పంటించాడు. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
Ajmal Shareef: ఇన్స్టాగ్రామ్లో RIP అని స్టేటస్ పెట్టి, ఆ మర్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు
నిర్మలపై పెట్రోలు పోసేముందు సురేష్ నిర్మల తమ్ముడికి ఫోన్ చేసి నిప్పంటించినట్లు చెప్పాడని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిర్మలను పుట్టింటికి తీసుకువద్దామనుకునే లోపు సురేష్ ఈ దారుణానికి తెగబడ్డాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మల బావ సురేష్ పోలీసులు అదుపులో ఉన్నాడు.