IIT Kanpur : కాన్పూర్ ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య
కాన్పూర్ ఐఐటీలో ఓ రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పల్లవి చిల్కా అనే విద్యార్థిని కాన్పూర్ ఐఐటీలో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ విభాగంలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధన చేస్తోంది....

IIT Kanpur
IIT Kanpur : కాన్పూర్ ఐఐటీలో ఓ రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పల్లవి చిల్కా అనే విద్యార్థిని కాన్పూర్ ఐఐటీలో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ విభాగంలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధన చేస్తోంది. పల్లవి చిల్కా తన గదిలో ఉరి వేసుకుని కనిపించింది. పల్లవి ఉన్న హాస్టల్ గది తలుపును పారిశుద్ధ్య సిబ్బంది తట్టగా ఎలాంటి స్పందన రాలేదు.
ALSO READ : Covid-19 : కేరళలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. ముగ్గురు మృతి
దీంతో వారు తలుపు పగులగొట్టి చూడగా పల్లవి ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలాన్ని సందర్శించింది. డాక్టర్ పల్లవి మరణంతో కాన్పూర్ ఐఐటీ ఓ మంచి పరిశోధకురాలిని కోల్పోయిందని తెలిపింది. పల్లవి చిల్కా ఒడిశాలోని కటక్ నగరానికి చెందిందని, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని పోలీసులు చెప్పారు.