జిహాదీల ఉగ్రదాడిలో 53 మంది సైనికులు మృతి

జిహాదీల ఉగ్రదాడిలో 53 మంది సైనికులు మృతి

Updated On : November 2, 2019 / 7:02 AM IST

సైనిక స్థావరాలపై జిహాదీలు చేసిన ఉగ్రదాడిలో 53మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఓ మిలిట‌రీ పోస్టుపై జ‌రిగిన దాడిలో సుమారు 53 మంది సైనికులు మృతి చెందారు. మాలిలోని మేనక ప్రాంతంలో ఉన్న ఒక ఔట్ పోస్ట్‌ను ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

53 మంది మృతి చెందగా మరో 10 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సంవత్సరం నుంచి జిహాదీలను తరిమికొట్టాలని ఆ దేశంలో ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. సెప్టెంబరులో బుర్కినో పాసోలో కూడా ఇద్దరు జిహాదీలు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతి చెందారు. 
 
శుక్ర‌వారం జ‌రిగిన దాడికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సంస్థ బాధ్య‌త ప్ర‌క‌టించ‌లేదు. ఉత్త‌ర మాలి ప్రాంతంలో ఆల్‌ఖ‌యిదా ఉగ్ర‌వాదులు ఆధిప‌త్యం చెలాయిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ ద‌ళాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌తో ఉగ్ర‌వాదులు ప్ర‌తిదాడుల‌కు దిగుతున్నారు.