ఇంకా పరారీలోనే MRO హసీనా : విచారణలో విస్తుపోయే విషయాలు.. వెలుగులోకి 7 రూముల వ్యవహారం
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ.. విచారణ ముమ్మరం చేశారు. విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు బీ, సీ క్యాంపుల్లోని 7 హాస్టళ్లలో హసీనా రూములు తీసుకున్నట్టు గుర్తించారు. అంతేకాదు అన్ని హాస్టళ్లకు ప్రతి నెల రూమ్ రెంట్ కూడా చెల్లిస్తున్నారు. అయితే ఇన్ని హాస్టళ్లలో రూములు ఎందుకు తీసుకున్నారు అనేది తెలియడం లేదు. దీనిపై అధికారులు దర్యాఫ్తు చేపట్టారు.
మరోవైపు హసీనాకు ఎవరైనా ఆమెకు ఆశ్రయం కల్పిస్తే.. వాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. హసీనా బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. హసీనా ఇంటికి వస్తే కచ్చితంగా సమాచారం ఇవ్వాలని పోలీసులు వారికి చెప్పారు.
లంచం కేసులో ఎమ్మారో హసీనా అడ్డంగా దొరికిపోయారు. సురేష్ అనే వ్యక్తి నుంచి తహసీల్దార్ హసీనా రూ.4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దాంతో సురేష్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సురేష్ కి రూ.4 లక్షలు డబ్బులిచ్చి పంపారు. అయితే తహసీల్దార్ హసీనా తెలివిగా వ్యవహరించారు. తనకు నమ్మకస్తుడైన బాషా అనే వ్యక్తి.. వేరే చోట ఉంటాడని అతనికి లంచం డబ్బు ఇవ్వాలని చెప్పారు. ఆమె చెప్పినట్టే సురేష్.. బాషాకు లంచం డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హసీనా పారిపోయారు. అప్పటినుంచి హసీనా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.