పోలీసులపై చర్యలు తీసుకోవాలి : దిశ కేసు..సుప్రీంకోర్టులో పిటిషన్

  • Published By: madhu ,Published On : December 7, 2019 / 06:42 AM IST
పోలీసులపై చర్యలు తీసుకోవాలి : దిశ కేసు..సుప్రీంకోర్టులో పిటిషన్

Updated On : December 7, 2019 / 6:42 AM IST

దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్‌లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

2019, డిసెంబర్ 06వ తేదీ తెల్లవారుజామున షాద్ నగర్‌ వద్ద చటాన్ పల్లిలో నిందితులు దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు)లు చనిపోయారు. ఘటన జరిగిన అనంతరం దిశకు న్యాయం కలిగిందని సమాజం చెబుతోంది. ఎన్ కౌంటర్‌కు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నలుగురు ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర హోం శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీ, పోలీసు కమీషనర్ సజ్జనార్‌లను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్ కౌంటర్‌కు సంబంధించి సుప్రీం 16 మార్గదర్శకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో అనుకోకుండా ఎన్ కౌంటర్ జరిగిందా ? జీవించే హక్కుకు భంగం కలిగించే విధంగా ఎన్ కౌంటర్ జరిగిందా ? అన్న అంశాలను ప్రస్తావించారు.

సమగ్ర విచారణ జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, సిట్, సీబీఐ, సీఐడీ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. 
ఇదిలా ఉంటే..బాధిత కుటుంబాలతో పిటిషన్లు దాఖలు చేసిన వ్యక్తులకు సంబంధం లేదు. NHRC సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్‌కు ఓ బృందం చేరుకుంది. ఘటనస్థలాన్ని, మృతదేహాలను వీరి పరిశీలించనున్నారు. మరి రిట్ పిటిషన్లను సుప్రీం స్వీకరిస్తుందా ? స్వీకరిస్తే..ఎప్పుడు విచారణ జరుపుతారు ? తదితర వివరాలు కొద్ది రోజుల్లో తెలియనుంది. 
Read More : దిశ ఎన్ కౌంటర్‌పై కేసు నమోదు..బుల్లెట్ల కోసం సెర్చింగ్