Actress Alankrita Sahai : పట్టపగలు నటిని బంధించి రూ.6.5 లక్షలు చోరీ

ముగ్గురు దుండగులు ఒక నటిని పట్టపగలే ఆమె ఇంట్లో బంధించి రూ. 6లక్షల రూపాయలు దోచుకుపోయారు.

Actress Alankrita Sahai : పట్టపగలు నటిని బంధించి రూ.6.5 లక్షలు చోరీ

Alankrita Sahai

Updated On : September 8, 2021 / 2:59 PM IST

Actress Alankrita Sahai :  దొంగలు ఇటీవల మరీ బరితెంగిచారు. చోరీ చేయటానికి పగలు రాత్రి లేకుండా చోరీ చేస్తున్నారు. మారణాయుధాలు చూపించి ఇంట్లో వారిని భయబ్రాంతులకు గురితచేసి మరీ దొచుకు పోతున్నారు. ప్రాణం దక్కింది చాలు..దేవుడా అనుకుంటూ బాధితులు నోరు మూసుకుని కూర్చుంటున్నారు. ఇటీవల ముగ్గురు దుండగులు ఒక నటిని పట్టపగలే ఆమె ఇంట్లో బంధించి రూ. 6లక్షల రూపాయలు దోచుకుపోయారు.

ఢిల్లీలో నివసించే మోడల్, నటి అలంకృత సహాయ్ ఇటీవల  తన తల్లితండ్రుల కోసం చంఢీగర్ లోని సెక్టార్ 27లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు.  ఢిల్లీ నుంచి వాళ్లు రెండు మూడురోజుల్లో షిఫ్టు అవుతారు. ఈలోగా ఇంట్లోకి కావాల్సిన   ఫర్నీచర్ మొదలైనవి అలంకృత   ఏర్పాటు చేస్తున్నారు.

ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు దగ్గరుండి చేయిస్తున్నారు. ఈక్రమంలో ఆమె మంగళవారం మధ్యాహ్నం   సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండగా,  ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు.  వారిలో ఒకరు ఆమె    ఏటీఎం కార్డు తీసుకువెళ్ళి రూ.50వేలు విత్ డ్రా చేసుకువచ్చారు.

ఈలోగా ఇంట్లో ఉన్న ఇద్దరు దుండగులు ఆమెను కత్తితో  బెదిరించి, అరిస్తే చంపుతామని… ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు దోచుకున్నారు.  మొత్తంగా సుమారు రూ.6.5 లక్షల విలువైన నగదు, నగలు పోయినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు. దుండగులలో ఒకరు ఇటీవల   ఇంట్లో ఫర్నీచర్ డెలివరీ  చేయటానికి వచ్చిన వారిలో ఒకరు  అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.