3 రోజుల తర్వాత చెరువులో నిహారిక మృతదేహం.. గట్టుపై సైకిల్, బుక్స్, బ్యాగ్ : అసలేం జరిగింది

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. 3 రోజుల తర్వాత నిహారిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 09:25 AM IST
3 రోజుల తర్వాత చెరువులో నిహారిక మృతదేహం.. గట్టుపై సైకిల్, బుక్స్, బ్యాగ్ : అసలేం జరిగింది

Updated On : December 19, 2019 / 9:25 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. 3 రోజుల తర్వాత నిహారిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. 3 రోజుల తర్వాత నిహారిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని నిహారిక 3 రోజుల క్రితం అదృశ్యమైంది. 

తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. ఇంతలో దారుణం జరిగిపోయింది. ఎల్ఎల్ సీ కెనాల్ చెరువులో నిహారిక మృతదేహం లభ్యమైంది. చెరువు గట్టుపైనే నిహారిక సైకిల్, బుక్స్, బ్యాగ్ ఉన్నాయి. 

ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిహారికను ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా అనే యాంగిల్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. నిహారిక మృతి మిస్టరీగా మారింది.

దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మహిళలను ఉలిక్కిపడేలా చేసింది. అమ్మాయిల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట మృగాళ్లు విరుచుకుపడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకొస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. 3 రోజుల క్రితం అదృశ్యమైన నిహారిక.. ఇప్పుడు సడెన్ గా విగతజీవిగా కనిపించడం కలకలం రేపుతోంది. పోలీసులు ఈ కేసుని సవాల్ తీసుకున్నారు. మిస్టరీని చేధించే పనిలో పడ్డారు.

Also Read : 2019లో ఆ సినిమాలే ఎక్కువ: ఆరబోతలు.. అడల్ట్ కంటెంట్‌తో!