కోడిగుడ్ల కోసం : గర్భిణిపై అంగన్‌వాడి ఆయా దాడి

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 01:35 PM IST
కోడిగుడ్ల కోసం : గర్భిణిపై అంగన్‌వాడి ఆయా దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కోడి గుడ్ల కోసం కోసం గొడవ జరిగింది. ఓ గర్భిణి ప్రాణం మీదకు తెచ్చింది. టేకులపల్లిలో 6 నెలల గర్భిణిపై అంగన్‌వాడీ ఆయా దాడి చేసింది. దీంతో.. కడుపులో పిండం బయటపడింది. మద్దిరాల తండాకు చెందిన బాదావత్ పద్మ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్ళింది. గుడ్డు విషయంలో ఆయాకు, గర్భిణికి గొడవ జరిగింది. దీంతో… గర్భిణిపై ఆయా దాడి చేసింది. కడుపులో పిండం బయట పడటంతో… పద్మను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయా దాడితో గర్భిణికి అబార్షన్ చేయాల్సి వచ్చింది.