రాజ్యాంగ నిర్మాతకు అవమానం : అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని రిటైర్డ్ ఉద్యోగి ధ్వంసం చేశాడు.

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 07:03 AM IST
రాజ్యాంగ నిర్మాతకు అవమానం : అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

Updated On : January 27, 2019 / 7:03 AM IST

మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని రిటైర్డ్ ఉద్యోగి ధ్వంసం చేశాడు.

మేడ్చల్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాలను కొంతమంది అవమానిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడన్న విషయాన్ని మర్చిపోయి విగ్రహాలపై దాడులకు పాల్పడుతూ, ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఓ ప్రబుద్ధుడు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.

 

రాంపల్లి గ్రామంలో చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని చాందియా అనే రిటైర్డ్ ఉద్యోగి ధ్వంసం చేశాడు. విగ్రహాన్ని కూల్చివేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు, అంబేద్కర్ అభిమానులు ఆందోళన చేపట్టారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేదర్క్ విగ్రహాలను అవమానపరచడం, దాడులు చేయడం, ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని  హితవుపలికారు. అందరూ అంబేద్కర్ ను గౌరవించాలన్నారు. ఆందోళనకారులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేసింది రిటైర్డ్ ఉద్యోగి చాందియా అని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చాందియాకు మతిస్థిమితం లేదని పోలీసులు అంటున్నారు. దీంతో దళిత సంఘాలు, అంబేద్కర్ అభిమానులు ఆందోళనను విరమించారు.