Road Accidents In America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే బంధువులు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ హైవేలో జరిగిన ప్రమాదంలో ఏపీ వాసులు మృతి చెందారు.

Road Accident
America Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఫోర్ట్ వర్త్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా టెక్సాస్ నుంచి అట్లాంటా 67హైవేపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఐదుగురు ఏపీకి చెందిన వారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన వారిగా గుర్తించారు.
Also Read : Israel issues warning : ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
మృతుల్లో ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ బంధువులు ఉన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు నాగేశ్వరరావు, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు, తల్లి సీతామహాలక్ష్మి టెక్సాస్ కు వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కుటుంబ సభ్యులు మృతితో అమలాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.