Love Marriage : ప్రేమ వివాహం చేసుకుందని, పోలీసుస్టేషన్‌లో చెల్లెలిపై దాడి చేసిన అన్న

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.... చెల్లెలిపై అన్న పోలీసు స్టేషన్‌లోనే కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

Love Marriage : ప్రేమ వివాహం చేసుకుందని, పోలీసుస్టేషన్‌లో చెల్లెలిపై దాడి చేసిన అన్న

nellore district

Updated On : January 11, 2022 / 2:35 PM IST

Love Marriage :  ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో…. చెల్లెలిపై అన్న పోలీసు స్టేషన్‌లోనే కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.  నెల్లూరు జిల్లా కోవూరుకట్ట కింద చెర్లోపాలెం‌కు చెందిన అశోక్(26) అనే యువకుడు… బుచ్చి   జండా దిబ్బ గ్రామానికి చెందిన శిరీష(23) అనే యువతిని ప్రేమించాడు.

వీరిద్దరి ప్రేమను రెండు కుటుంబాల వారు వ్యతిరేకించారు. దీంతో ఇద్దరూ పారిపోయి ఇళ్ళలో వారికి తెలియకుండా ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం కొవూరు పోలీసులను ఆశ్రయించారు. వారిద్దరూ మేజర్లు కావటంతో కోవూరు పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Also Read : Khushbu Sundar : సీనియర్ నటి, తమిళ బిజెపి నాయకురాలు ఖుష్భుకి కరోనా పాజిటివ్
పోలీసు స్టేషన్ నుంచి బయటకు వెళుతుండగా   శిరీష అన్న హరీష్  ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శిరీష  గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతంఆమె పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.