Kolkata : మరో మోడల్ ఆత్మహత్య-రెండు వారాల్లో నలుగురు మృతి

Kolkata : మరో మోడల్ ఆత్మహత్య-రెండు వారాల్లో నలుగురు మృతి

Sarswathi Das

Updated On : May 30, 2022 / 5:11 PM IST

Kolkata :  పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్‌కతా‌లో మరో మోడల్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు వారాల్లో మరణించిన మోడల్స్ సంఖ్య 4కి చేరింది. మోడల్, మేకప్ ఆర్టిస్ట్ అయిన సరస్వతి దాస్ (18) అనే యువతి ఆదివారం కస్బా ప్రాంతం బేడియా దంగాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఉండగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

చిన్న చిన్న వెంచర్లకు సరస్వతి మోడల్ గా పని చేస్తూ పలు ఆఫర్లను అందుకుంటోందని   ఆమె అమ్ముమ్మ చెప్పారు. శనివారం రాత్రి  సరస్వతి తన చున్నీతో  సీలింగ్ కు ఉరి వేసుకుని  ఆత్మహత్య చేసుకుంది.  ఆదివారం ఉదయం ఆమెను చూసిన అమ్ముమ్మ కూరగాయలు కోసుకునే కత్తితో  చున్నీ కత్తిరించి ఆమెను కిందకు దించింది. వెంటనే పోలీసులకు  సమచారం ఇచ్చి,  సమీపంలోని  ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. అప్పటికే సరస్వతి మరణించింది. పోస్టు మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.

కాగా… గడిచిన 15 రోజుల్లో కోల్‌కతాలో నలుగురు మోడల్స్ ఆత్మహత్య చేసుకున్నారు. సరస్వతి ఆత్మహత్య కు, గతంలో మరణించిన మోడల్స్ ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  సరస్వతి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమె ఫోన్ కాంటాక్ట్ లు, ఆమె సోషల్ మీడియా ఎకౌంట్లను. ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. సరస్వతి   ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆమె తల్లి, పిన్ని ఇంట్లో లేరు.  ఆమె చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేయటంతో సరస్వతి తల్లి, పిన్ని పనులు చేసి ఆమెను పెంచి పెద్ద చేశారు.

గత బుధవారం మోడల్ బిదిషా డి మజుందార్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన 26 ఏళ్ల మరోక మోడల్ మంజుషా నియోగి శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు ఘటనలకు ముందు మే 15న మోడల్, టీవీ నటి పల్లవి డే, గార్ఫా ప్రాంతంలోని అద్దె అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదంగా మరణించింది.

వీరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు   ఆదిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పడు సరస్వతి కూడా ఆత్మహత్య  చేసుకోవటంతో  మోడల్స్ వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.

Also Read : Gachibowli Gang Rape Case : గచ్చిబౌలి యువతి గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్టులు.. వెలుగులోకి గాయత్రి దురాఘతాలు