రీపోస్టుమార్టంతో ఉపయోగం లేదు : ఫోరెన్సిక్ నిపుణులు

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించడం వలన ఉపయోగం ఉందా.. లేదా.. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీపోస్ట్‌మార్టంతో నిందితుల నిగ్గుతేలుతుందా.. ? లేదా.. ? అన్న అంశంపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత రీపోస్ట్‌మార్టంతో ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు ఫోరెన్సిక్ నిపుణులు నారాయణ రెడ్డి.
తలకు బలమైన గాయం తగలటం వల్లే ఆయేషా మీరా చనిపోయిందనే విషయం అందరికీ తెలిసిందేనని.. ఇప్పుడు రీ పోస్టుమార్టం వల్లఉపయోగంలేదని నిందితులను గుర్తించడం సాధ్యం కాదని ఆయన చెపుతున్నారు. సీబీఐ దర్యాప్తులో కొత్తగా తేలేదేమి ఉండకపోవచ్చని అన్నారు. కేసు ఇంత క్లిష్టంగా మారటానికి కారణం దర్యాప్తు చేయటంలో పోలీసుల విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
సీబీఐ అధికారులు ఇప్పుడు సేకరించే ఆయేషా ఎముకల నుంచి కొత్తగా తెలుసుకునేది ఏమీ ఉండదని…రక్తం మరకలు ఉన్నచోట నిందితుడి పాదముద్రలు గుర్తించలేదని ఆయన వివరించారు. ఇప్పుడు నిందితులను గుర్తించటం కష్టం అన్నారు.డీఎన్‌ఏ టెస్టుకు సుమారు వారం రోజుల సమయం పడుతుందన్నారు నారాయణరెడ్డి .
సీబీఐ లో స్పెషలైజ్డ్ పోలీసులు ఉంటారనే అపోహ ప్రజల్లో ఉందన్నారు. శవం కుళ్లి పోవటం వల్ల ఇప్పుడు ఏమీ ఆధారాలు లభించవన్నారు. ఆయేషా మీరా కేసులో మళ్లీ కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల ఎవరు అత్యాచారం చేశారో తెలీదన్నారు. ప్రాధమిక స్ధాయిలోనే ఇన్వెస్టిగేషన్ లో స్ధానిక పోలీసులు నిర్లక్ష్యం వహించటం వల్ల పాదముద్రలు, వేలిముద్రలు తీసుకోలేదని చెప్పారు.