B.Tech student suspecious death : బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య

 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లో చంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మల్లారెడ్డిఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది.

B.Tech student suspecious death : బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య

B.tech Student Suspecious Death

Updated On : March 23, 2021 / 2:54 PM IST

B.Tech student suspecious death :  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లో చంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మల్లారెడ్డిఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. చంద్రిక స్వస్ధలం మిర్యాలగూడ కాగా… ఆమె మైసమ్మ గర్ల్స్ హాస్టల్ లో ఉంటోంది. హాస్టల్ భవనం పై నుంచి దూకి చంద్రిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

కాగా… ఈఘటనపై డీసీపీ పద్మజ మట్లాడుతూ… మంగళవారం ఉదయం గం.8-15 కి స్ధానిక కౌన్సిలర్ పోలీసు స్టేషన్ కు ఫోన్ చేసి…’కృప హాస్టల్‌ పక్కన యువతి మృతదేహాం పడి ఉందని చెప్పారన్నారు. కాగా… యువతికి బ్యాక్ లాగ్ ఉన్నాయని తెలిసిందని…కరోనా తర్వాత ఇటీవలే హైదరాబాద్ కు వచ్చిందని తెలిపారు. మళ్లీ పరీక్షలకు ప్రిపేర్ అవుతన్న చంద్రిక చదువులో వెనుకబడి ఉన్నాననే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు డీసీపీ చెప్పారు. చంద్రిక ఫోన్ స్వాధీన పరుచుకుని ఆమె కాల్ డేటాను, సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని ఆమె తెలిపారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లో చంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మల్లారెడ్డిఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. చంద్రిక స్వస్ధలం మిర్యాలగూడ కాగా… ఆమె మైసమ్మ గర్ల్స్ హాస్టల్ లో ఉంటోంది. హాస్టల్ భవనం పై నుంచి దూకి చంద్రిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.