వాళ్ల కోసమేనా! : 10ఉరితాళ్లు సిద్ధం చేయాలని ఆదేశాలు

డిసెంబర్ 14లోగా 10 పీసుల ఉరితాళ్లను సిద్దం చేయాలని బీహార్ లోని బక్సర్ జైలుకు ఆదేశాలు అందాయి. ఉరితీయడానికి ఉపయోగించే రోప్ లను తయారుచేయడంలో పేరుపొందిన బక్సర్ జైలుకు ప్రిజన్ డైరక్టరేట్ ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉరితాళ్లు నిర్భయ కేసులోని దోషుల కోసమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ….డిసెంబర్ 14లోగా 10 పీసుల ఉరితాళ్లను సిద్దం చేయాలని మాకు ఆదేశాలొచ్చాయి. ఇవి ఎక్కడ ఉపయోగించబోతున్నారో మాకు తెలియదు. బక్సర్ జైలుకి ఉరితాళ్లను సిద్ధం చేయడంలో చాలా అనుభవం ఉంది. ఒక్క ఉరితాడును సిద్ధం చేయడానికి మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా మోటరైజ్డ్ యంత్రాలను తక్కువగా ఉపయోగించడంతో మాన్యువల్ శ్రమ ఉంటుంది.
పార్లమెంట్ పై దాడికి పాల్పడిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురుని ఉరి తీయడానికి ఉపయోగించిన తాడుని ఈ జైలు నుంచే పంపించాం. 2016-17లో కూడా పటియాలా జైలు నుంచి మాకు ఉరితాడులు సిద్ధం చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఎందుకో మాకు తెలియదు. చివరిసారిగా ఈ జైలు నుంచి పంపించిన ఉరితాడు ఖరీదు రూ.1,725అని అరోరా తెలిపారు. ఇనుము మరియు ఇత్తడి ధరలలో హెచ్చుతగ్గుల కారణంగా రేటు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అరోరా తెలిపారు. ఈ లోహాలను తాడు చుట్టూ కట్టుకున్న పొదలను మెడ చుట్టూ గట్టిగా ఉండేలా చూసుకోవడానికి ఉపయోగిస్తారు జైలు సూపరింటెండెంట్ వివరించారు.