Whatsapp Nude Video : వాట్సాప్‌లో నూడ్‌గా యువతి… ఆ తర్వాత..

మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో దోచుకుంటున్నారు. ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ను వాడుకుని చీట్ చేస్తున్నారు. వాట్సాప్‌ కు వీడియోకాల్‌ చేయడం, నగ్నంగా కనిపించడం, నీ నగ్న చిత్రం పంపమని రెచ్చగొట్టడం.. ఆ తర్వాత

Whatsapp Nude Video : వాట్సాప్‌లో నూడ్‌గా యువతి… ఆ తర్వాత..

Whatsapp Nude Video

Updated On : August 5, 2021 / 2:59 PM IST

Whatsapp Nude Video : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో దోచుకుంటున్నారు. ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ను వాడుకుని చీట్ చేస్తున్నారు. వాట్సాప్‌ కు వీడియోకాల్‌ చేయడం, నగ్నంగా కనిపించడం, నీ నగ్న చిత్రం పంపమని రెచ్చగొట్టడం.. ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు దండుకోవడం. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయి. జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఇంకా కొంతమంది మోసపోతూనే ఉన్నారు.

తాజాగా మైలార్‌దేవుపల్లి పరిసరాల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం లక్ష్మీగూడలో ఉండే ఇంటర్‌ విద్యార్థి(20) సెల్‌ఫోన్‌కు ఓ యువతి నుంచి కాల్‌ వచ్చింది. నీ అందం చూసి పడిపోయానంటూ మూడు గంటల మాట్లాడింది. మరుసటి రోజు వీడియో కాల్‌ వచ్చింది. ఓ యువతి తల కనిపించకుండా నగ్నంగా కనిపించింది. నువ్వంటే నాకు ప్రేమ… అందుకే ఇలా కనిపిస్తున్నానంటూ ఏమార్చింది. ఆపై నాకు నీ నగ్న చిత్రం లేదా వీడియో పంపించాలని కోరింది. ఆ మాటలకు మోసపోయిన విద్యార్థి నగ్నంగా తయారై వీడియోకాల్‌లో కనిపించాడు.

కట్ చేస్తే.. ఓ వ్యక్తి వీడియో కాల్‌లో ప్రత్యక్షమయ్యాడు. బ్లాక్‌మెయిల్‌ కు దిగాడు. మా ఇంటి ఆడపిల్లకు నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు పంపిస్తావా… మీ ఇంటికి వచ్చి మీ వాళ్లను నిలదీస్తానని విద్యార్థిని హెచ్చరించాడు. దీంతో విద్యార్థి బిత్తరపోయాడు. అలా చేయొద్దని వేడుకున్నాడు. ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. దీంతో బాధితుడి నుంచి రూ.20వేలు రాబట్టాడు. ఇంతలో ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసింది. వారు మైలార్‌దేవ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో శాస్త్రిపురానికి చెందిన మరో విద్యార్థి కూడా మోసపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులతో పరిచయాలు అంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.