కరోనా సోకి BMC డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : June 9, 2020 / 01:08 PM IST
కరోనా సోకి BMC డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మృతి

Updated On : June 9, 2020 / 1:08 PM IST

దేశ ఆర్థికరాజధానిలో కరోనా వైరస్ విజృంభణతో పెద్ద సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC)డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్ కరోనా వైరస్ సోకి మరణించారు. కరోనా వైరస్ తో ఇవాళ(జూన్-9,2020)శిరీష్ దీక్షిత్ తన ఇంట్లో కన్నుమూశాడని అధికారులు తెలిపారు.

55ఏళ్ల శిరీష్ దీక్షిత్ నీటి సరఫరా డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజినీర్ గా పనిచేశాడు. కాగా,దేశంలోని మిగతా రాష్ట్రాలన్నికంటే మహారాష్ట్రలోనే కరోనా పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కేసుల విషయంలో వైరస్ పుట్టినిల్లు చైనానే దాటిపోయింది మహారాష్ట్ర. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2లక్షల 67వేలు దాటగా,ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 89వేల కేసులు నమోదయ్యాయి.

ఒక్క ముంబైలోనే 50వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ముంబైలో యాక్టివ్ కేసులు 26వేలకు పైనే ఉన్నాయి. ఇక ముంబైలో 1700కి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలుగా తమిళనాడు(33వేలకు పైగా కేసులు),ఢిల్లీ(29వేలకు పైగా కేసులు)నిలిచాయి.