గణేష్ నిమజ్జనంలో ప్రమాదం : బోటు మునిగి 11మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో గణేష్ నిమజ్జనంలో విషాదం జరిగింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఓ బోటు ప్రమాదానికి గురైంది. నీళ్లలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 04:16 AM IST
గణేష్ నిమజ్జనంలో ప్రమాదం : బోటు మునిగి 11మంది మృతి

Updated On : September 13, 2019 / 4:16 AM IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో గణేష్ నిమజ్జనంలో విషాదం జరిగింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఓ బోటు ప్రమాదానికి గురైంది. నీళ్లలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో గణేష్ నిమజ్జనంలో విషాదం జరిగింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ఓ బోటు ప్రమాదానికి గురైంది. నీళ్లలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది చనిపోయారు. ఐదుగురిని సహాయక బృందాలు కాపాడాయి. ప్రస్తుతం గాలింపు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) తెల్లవారుజామున 4.30 సమయంలో ఖట్లాపుర ఘాట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గణేష్ నిమజ్జనం కోసం 16 మందిని తీసుకెళ్తున్న బోట్ ఒక్కసారిగా మునిగిపోయింది. వెంటనే గజ ఈతగాళ్లు స్పందించి ఐదుగురిని కాపాడారు. మిగతా వారిని కాపాడలేకపోయారు.

మొత్తం 11 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా ఎవరైనా నీటిలో ఉండిపోయారా అన్న అనుమానంతో గాలింపు చర్యలను కంటిన్యూ చేస్తున్నారు. 40మంది పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. 11మంది చనిపోవడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు ఆనందంగా గడిపిన వారు.. ఇంతలోనే ప్రమాదం బారిన పడి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది.