Bob Dylan : ప్రసిధ్ధ గాయకుడిపై లైంగిక వేధింపుల కేసు

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ గీత రచయిత, జానపద గాయకుడు, నోబెల్ అవార్డు విన్నర్ బాబ్ డిలాన్(80) పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.

Bob Dylan : ప్రసిధ్ధ గాయకుడిపై లైంగిక వేధింపుల కేసు

Bob Dylan

Updated On : August 18, 2021 / 2:08 PM IST

Bob Dylan : అమెరికాకు చెందిన సుప్రసిద్ధ గీత రచయిత, జానపద గాయకుడు, నోబెల్ అవార్డు విన్నర్ బాబ్ డిలాన్(80) పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ప్రస్తుతం 68 ఏళ్ల వయస్సున మహిళ బాబ్ డిలాన్ 1965 సంవత్సరం ఏప్రిల్-మే నెలల మధ్య సుమారు ఆరువారాల పాటు డిలాన్ అపార్ట్ మెంట్‌లో పలు మార్లు లైంగిక దాడి చేసినట్లు వివిరిస్తూ న్యూయార్క్ సుప్రీం కోర్టులో కేసు వేసింది.

Bob Dylan In 1965

Bob Dylan In 1965

అప్పుడు తన వయస్సు 12 ఏళ్లు అని… డిలాన్ వయస్సు 23, 24 ఏళ్లు ఉంటుందని… తనను తీవ్రంగా శారీరక మానసిక హింసకు గురిచేసినట్లు బాధితురాలు తన పిటీషన్ లో పేర్కోంది. డిలాన్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కోర్టును కోరింది. కాగా బాధిత మహిళ ఆరోపణలను డిలాన్ కొట్టి పడేశారు.