ప్రధానితో బాలీవుడ్ సెల్ఫీ

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 10:16 AM IST
ప్రధానితో బాలీవుడ్ సెల్ఫీ

ఢిల్లీ  : ప్రధాని నరేంద్రమోదీతో బాలివుడ్ నటీనటులు,దర్శకులు..నిర్మాతలు అంతా కలిసి సెల్ఫీ తీసుకున్నారు. బాలీవుడ్ గ్లామర్ మొత్తం ఒక్కచోటకు చేరినట్లుగా వుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నేతృత్వంలో 14 మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతల బృందం జనవరి 11న  ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.   నటులు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్, సిద్ధార్థ్ మల్హోత్రా, నటీమణులు ఆలియాభట్, భూమి పెడ్నేకర్, డైరెక్టర్లు అశ్వినీ అయ్యర్, రోహిత్ శెట్టి, నిర్మాతలు ఏక్తా కపూర్, మహవీర్ జైన్ ఉన్నారు.

జాతి నిర్మాణంలో బాలీవుడ్ పాత్ర.. వినోదాన్ని విద్యలో ఎలా భాగస్వామ్యం చేయాలనే విషయంపై ప్రధానితో వారు చర్చించారు. సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం కరణ్ జోహర్ ప్రధాని మోదీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీతో సమావేశం కావడం అద్భుతమైన అవకాశమని ఫొటో కింద క్యాప్షన్ రాశారు. 
Narendra modi, karan johar