పీటలపైనే అనుమానమా : తాళి కట్టిన వెంటనే.. కన్యత్వ పరీక్ష

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు.కానీ ఓ యువతికి పెళ్లంటే ఒక్కరోజు ముచ్చట,ఓ మాసిపోని మచ్చలా మిగిలిపోయింది.కట్టుకున్నవాడితో కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా గడపాలనుకున్న ఆ యువతి కన్నీళ్లే మిగిలాయి.పెళ్లైన మరుసటి రోజే అవమానాలు ఎదురయ్యాయి.కాళ్ల పారాణి ఆరకముందే కట్టుకున్నవాడు నరకం చూపించాడు.కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు
ఉత్తర కర్ణాటకకు చెందిన శరత్(29),రక్ష(26)లు ఎంబీఏ గ్రాడ్యేయేట్స్. బెంగళూరులో పేరుపొందిన కంపెనీల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు.మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు.కొన్నిరోజులు ఇద్దరూ మాట్లాడుకున్నారు.2018 నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే వీరి పెళ్లికి 15రోజుల ముందు రక్ష తల్లి చనిపోయింది. దీంతో ఆ అమ్మాయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. పెళ్లికి ముందే అమ్మ చనిపోవడంతో ఆమె మానసికంగా కూడా కుంగిపోయింది.అయితే శరత్…తనతో పెళ్లి రక్షకు ఇష్టం లేదని భావించాడు.
రక్ష బాధలో ఉన్న సమయంలో ఆమెకు ఓ ఫోన్ వచ్చింది.ఆ ఫోన్ చేసింది రక్ష ఫ్రెండ్.తల్లి చనిపోయి బాధలో ఉన్న యువతిని ఓదార్చాడు.రక్ష కూడా పలుసార్లు అతడితో మాట్లాడింది.రక్షను శరత్ తప్పుగా అపార్థం చేసుకోవడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణంగా మారింది.
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే
చివరకు రక్ష,శరత్ ల వివాహం జరిగింది.అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కారణంగా పెళ్లి అయిన కొద్ది సేపటికే రక్ష వాంతి చేసుకుంది.దీంతో అనుమానించిన శరత్ హాస్సిటల్ కు వెళ్లి చూయించుకుందువు పదా అని చెప్పి తీసుకెళ్లి కన్యత్వ పరీక్షతో పాటు ప్రెగ్నేన్సీ టెస్టును చేయించాడు.కొద్ది సేపటి తర్వాత ఇదంతా అర్థమయిన రక్ష శరత్ ని లాగిపెట్టి ఒక్కటి పీకింది. భర్తను వదిలి సోదరి ఇంట్లో మూడు నెలల పాటు ఉన్నది.
మూడు నెలల తర్వాత విడాకుల కోసం పరిహార్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో భర్త దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం బాధితురాలిని, భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భర్త చేసిన పనిని వారికి చెప్పగా కౌన్సెలింగ్ నిర్వాహకులు షాక్ అయ్యారు. తనకు విడాకులే కావాలని భర్త మొండిగా పట్టుబట్టాడు. దీంతో చేసేదేమీ లేక తనను వేధిస్తున్నాడని భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also : అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్