Jammu Accident : లోయలో పడిన బస్సు 5గురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో బస్సులు లోయలో పడిపోవడం పరిపాటై అయిపోయాయి. ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇందుకు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంటుండగా పరిమితికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకోవడం మరో కారణమౌతోంది. తాజాగా ఉద్దంపూర్ జిల్లా మజాల్తా వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. మార్చి 01వ తేదీ శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనలో 6గురు మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సురిన్‌సార్ నుంచి శ్రీనగర్‌కు బస్సు వెళుతోంది. మజాల్త వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పైకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్స్‌కి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.