California : కిరాతకుడికి 707 ఏళ్ల జైలు శిక్ష .. క్షమించేది లేదన్న ధర్మాసనం

చిన్నపిల్లలను వేధింపులకు గురి చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 707 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

California : కిరాతకుడికి 707 ఏళ్ల జైలు శిక్ష .. క్షమించేది లేదన్న ధర్మాసనం

California

California Court : బేబీ సిట్టర్ గా పనిచేస్తు చిన్నారులపై పాశవిక చర్యలకు పాల్పడిన కిరాతకుడికి అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థానం 707 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 17మంది చిన్నారులను లైంగికంగా వేధించిన 34 ఏళ్ల మాథ్యూ జక్ర్‌జెవ్స్కీ క్షమించరాని నేరం చేశాడని.. అటువంటి వ్యక్తిని క్షమించేది లేదు అంటూ ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అతను  మారువేషంలో ఉన్న రాక్షసుడు అంటూ కోర్టు అభివర్ణించింది. మొత్తం 34 కేసుల్లో నిందితునికి ధర్మాసనం 707 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తు గత శుక్రవారం (నవంబర్ ,2023) శిక్షను ఖరారు చేసింది.

బేబీకేరింగ్ సేవలు అందించే మాథ్యూ 2014 నుంచి 2019 మధ్య తన వద్ద ఉండే 17మంది పిల్లలను లైంగికంగా వేధించటం.. వారికి అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని తేలింది. తన పిల్లాడిని అనుచితంగా తాకాడు అంటూ ఓ జంట లగునా బీచ్ పోలీసుకలకు 2019మేలో ఫిర్యాదు చేయగా మాథ్యూ అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడ్ని 2019 మే 17న పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేయగా రెండు నుంచి 12 ఏళ్ల పిల్లలపై 34 నేరాలకు పాల్పడినట్లుగా తేలింది.

న్యాయస్థానం ఇంత కఠినమైన శిక్ష విధించినా మాథ్యూ మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపడలేదు. పైగా చిరునవ్వుతూనే ఉన్నాడు. ‘తాను పిల్లలకు ఆనందాన్నే పంచాను’అంటూ న్యాయమూర్తికి ముందు వెల్లడించాడు.అటువంటి వ్యక్తిని తమ పిల్లల కోసం నియమించుకున్నందుకు పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.