Mahabubabad Incident : దైవ దర్శనం చేసుకుని వెళ్తుండగా ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం
మృతులను ఇస్లావత్ శ్రీను, ఇస్లావత్ పాప(శ్రీను తల్లి), ఇస్లావత్ రిత్విక్(శ్రీను కుమారుడు), ఇస్లావత్ రిత్విక ( శ్రీను కూతురు) గుర్తించారు.

Mahabubabad Incident (Photo : Google)
Mahabubabad Incident : పండుగ పూట విషాదం అలుముకుంది. తెలంగాణలో రహదారి రక్తసిక్తమైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే. కారు, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో తల్లి, కొడుకు, మనుమడు, మనవరాలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులను చిన్నగూడూరు మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను ఇస్లావత్ శ్రీను, ఇస్లావత్ పాప(శ్రీను తల్లి), ఇస్లావత్ రిత్విక్(శ్రీను కుమారుడు), ఇస్లావత్ రిత్విక ( శ్రీను కూతురు) గుర్తించారు. వీరంతా నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ఘోరం జరిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారు కొత్తగూడ మండలం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని తిరిగి వెళ్తున్నారు.
Also Read : ప్రాణాలు తీస్తున్న పతంగుల పండుగ.. హైదరాబాద్‌లో పలువురు మృతి
కంబాలపల్లి వద్ద మహబూబాబాద్ వైపు వెళ్తున్న కారు.. ఆటోను ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు రిత్విక్, రిత్విక, శ్రీను, అతని తల్లి అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీను అత్త శాంతి, బావమరిది సర్దార్‌కు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read : కంపెనీ సీఈఓగా ఉంటూ కన్నబిడ్డను హత్య చేసిన కసాయి తల్లి.. పోలీసుల విచారణలో భయంకరమైన నిజాలు