Chaddy Gang : విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ

హైదరాబాద్ ప్రజలను వణికించిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు విజయవాడ నగరంలోకి ప్రవేశించారు.

Chaddy Gang : విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ

Chaddy Gang At Vijayawada

Updated On : November 30, 2021 / 8:35 PM IST

Chaddy Gang :  హైదరాబాద్ ప్రజలను వణికించిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు విజయవాడ నగరంలోకి ప్రవేశించారు. విజయవాడ శివారులోకి ఎంటరవగానే హల్ చల్ సృష్టించారు. సోమవారం తెల్లవారుఝామున చిట్టీనగర్‌లోని చెనుమొలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఉన్న శివదుర్గ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించి డబ్బు, బంగారాన్ని చోరీ చేశారు.

నిన్న తెల్లవారు జామున గం.3:15 గంటల సమయంలో ఫ్లాట్ నెంబర్ G-18లో మొదటి ఈ అంతస్థులో ఈ చోరీ జరిగింది. దొంగతనంపై చిట్టినగర్‌ పోలీస్ స్టేషన్లో అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Dollar Seshadri : ముగిసిన శేషాద్రిస్వామి అంత్యక్రియలు