Chhattisgarh : చత్తీస్‌ఘడ్‌లో ఎన్ కౌంటర్-కొనసాగుతున్న కాల్పులు

చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

Chhattisgarh : చత్తీస్‌ఘడ్‌లో ఎన్ కౌంటర్-కొనసాగుతున్న కాల్పులు

Chhatisgarh encounter

Updated On : May 6, 2022 / 2:03 PM IST

Chhattisgarh :  చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆరన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి నక్సలైట్లు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారనే సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) సిబ్బంది నక్సలైట్ల కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో జవాన్లకు నక్సలైట్లు తారసపడ్డారు. దీంతో నక్సలైట్లు పోలీసుల  పైకి కాల్పులు జరిపి అడవిలోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారని.. కాల్పులు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ సిధ్ధార్ధ తివారీ చెప్పారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు డీఆర్జీ జవాన్లు నక్సలైట్లను కదలనీయకుండా చుట్టు ముట్టారు. ఇరు వర్గాల నుంచి అడపా దడపా కాల్పులు జరుగుతున్నాయి. రెండు వైపులా ఇంతవరకు ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఈ సాయంత్రానికి మరింత సమాచారం అందుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Also Read : Allahabad HC : మసీదులపై లౌడ్ స్పీకర్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు