ఉన్నావ్ కేసు : సీఎం రావాలి..అప్పటి వరకు దహన సంస్కారాలు చేయం

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 06:23 AM IST
ఉన్నావ్ కేసు : సీఎం రావాలి..అప్పటి వరకు దహన సంస్కారాలు చేయం

Updated On : December 8, 2019 / 6:23 AM IST

ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చే వరకు తమ కూతురికి దహనసంస్కారాలు చేయబోమని కుటుంబసభ్యులు తేల్చిచెబుతున్నారు. సీఎం వెంటనే స్పందించి..నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ చేస్తున్నారు. వీరి కుటుంబాన్ని బీజేపీ మంత్రులు పరామర్శించారు. ప్రభుత్వ పరంగా రూ. 25 లక్షల చెక్కును అందచేశారు. తమకు ఎలాంటి పరిహారం అవసరం లేదని, నిందితులకు కఠినంగా శిక్షిస్తే చాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. 

హైదరాబాద్‌లో దిశ నిందితులను ఎలా ఎన్ కౌంటర్ చేశారో అలాగే చేయాలంటున్నారు. మృతి చెందిన బాధితురాలి కుటుంబానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్థానికులు మద్దతు ప్రకటించాయి. ఉన్నావ్ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఢిల్లీలో కన్నుమూసిన బాధితురాలి మృతదేహాన్ని భారీ పోలీసు భద్రత నడుమ 2019. డిసెంబర్ 07వ తేదీ శనివారం రాత్రి 9గంటలకు తరలించారు. 

* 90 శాతం కాలిన గాయాలతో అత్యాచార బాధితురాలు ఢిల్లీలో సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెంబర్ 06వ తేదీ రాత్రి చనిపోయింది. 
* ఐదుగురు నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 
* నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భద్రత నడుమ నిందితులను తరలించారు. 
* డిసెంబర్ 05వ తేదీ గురువారం ఆమె కోర్టు విచారణ కోసం రాయ్ బరేలీ వెళ్లేందుకు బైస్వారా బీహార్ రైల్వేస్టేషన్‌కు వెళుతోంది. 
* హరిశంకర్ త్రివేది, కిశోర్ శుభమ్, శివమ్, ఉమేష్‌లు అడ్డగించి ఆమెపై దాడి చేశారు. అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించారు. 
* అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె కంప్లయింట్ చేయడంతో కక్ష పెట్టుకున్నారు. 
* 90శాతానికిపైగా కాలిపోవడంతో అవయవాలు స్పందించకుండా పోయాయి. 
* ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించినా కాపాడలేకపోయారు వైద్యులు. 
మరి నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాలి. 
Read More : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం : ఫ్యాక్టరీకి అనుమతి లేదా ?