శిఖా చౌదరిపై ఫిర్యాదు : జయరాం హత్యకేసులో కొత్త మలుపు

హైదరాబాద్ : చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని కోరుతూ జయరాం భార్య పద్మశ్రీ మంగళవారం జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు శిఖా చౌదరిని తప్పించారని, శిఖా చౌదరి పాత్రను ఎక్కడా నిర్ధారణ చేయలేదని పద్శశ్రీ ఆరోపించారు. జయరాం పై రాకేష్ కు చెప్పింది శిఖా చౌదరేనని, ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదని, ఆమె ప్రశ్నించారు.
ఈ కేసులో ప్రధాన నిందుతురాలు శిఖా చౌదరి,ఆమె తల్లి సుశీల లపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.నందిగామ పోలీసుల విచారణ పై తనకు అనుమానాలు ఉన్నాయని. తన భర్త 2016 లోనే తన అక్క సుశీల,వారి కుటుంబ సభ్యులతో అపాయం ఉందని చెప్పారని ఆమె ఫిర్యాదులో పేర్కోన్నారు.