పోలీస్ స్టేషన్ లోనే కొడుకుని హత్య చేసిన కానిస్టేబుల్

చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ నేరానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుని పోలీస్ స్టేషన్ లోనే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చోరీ చోరా పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే అర్వింద్ యాదవ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలం నుంచి మొదటి భార్యతో గొడవలు పడుతున్నాడు. మొదటి భార్య కుమారుడు పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. దీంతో తండ్రి, కుమారుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో కొడుకుపై తీవ్ర ఆవేశంగా ఉన్న కానిస్టేబుల్ అర్వింద్ యాదవ్ తన తుపాకీతో కుమారుడు వికాస్ యాదవ్ ను కాల్చేశాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయాలైన అతను అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్వింద్‌ను అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని సీజ్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.