పరువు హత్య : మృతుడు నందకిషోర్ బావమరిది అరెస్ట్
తిరుమలగిరి టీచర్స్ కాలనీలో చోటు చేసుకున్న పరువు హత్య ఘటన నగరంలో సంచలనం రేపింది.

తిరుమలగిరి టీచర్స్ కాలనీలో చోటు చేసుకున్న పరువు హత్య ఘటన నగరంలో సంచలనం రేపింది.
హైదరాబాద్: తిరుమలగిరి టీచర్స్ కాలనీలో చోటు చేసుకున్న పరువు హత్య ఘటన నగరంలో సంచలనం రేపింది. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న నందకిషోర్ అనే యువకుడిని 2018, డిసెంబర్ 29 శనివారం అర్థరాత్రి దుండగులు తలపై బండరాయితో మోదీ కిరాతకంగా చంపేశారు. ఈ కేసులో పోలీసులు మృతుడు నందకిషోర్ బావమరిది మైకేల్, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. మైకేల్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులే హత్య చేయించారని నందకిషోర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు మైకేల్‌ను అరెస్ట్ చేశారు.
మూడేళ్ల పగ:
నందకిషోర్ మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో ఇంట్లో పెద్దవాళ్లు అడ్డు చెప్పినా లెక్కచేయకుండా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ తిరుమలగిరిలో సంసారం పెట్టాడు. అయితే పెళ్లి జరిగిననాటి నుండి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు నందకిశోర్‌ను తలపై బండరాయితో మోది చంపేశారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.