న్యూ ఇయర్ ట్రాజిడీ: బుల్లెట్ తగిలి బాలుడు మృతి

న్యూ ఇయర్ వచ్చేసింది. అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. ఇంతలో ఓ బుల్లెట్ శబ్దం వినిపించింది. తీరా చూస్తే ఓ పదేళ్ల కుర్రాడు నెలకొరిగాడు.

  • Published By: sreehari ,Published On : January 1, 2019 / 07:53 AM IST
న్యూ ఇయర్ ట్రాజిడీ: బుల్లెట్ తగిలి బాలుడు మృతి

న్యూ ఇయర్ వచ్చేసింది. అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. ఇంతలో ఓ బుల్లెట్ శబ్దం వినిపించింది. తీరా చూస్తే ఓ పదేళ్ల కుర్రాడు నెలకొరిగాడు.

న్యూ ఇయర్ వచ్చేసింది. అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. ఇంతలో ఓ బుల్లెట్ శబ్దం వినిపించింది. తీరా చూస్తే ఓ పదేళ్ల కుర్రాడు నెలకొరిగాడు. బుల్లెట్ తగిలి రక్తపు మడగులో పడి ఉన్నాడు. అప్పటికే ప్రాణం పోయింది. ఈ ఘటన ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ లో చోటుచేసుకుంది. అప్పటివరకూ న్యూ ఇయర్ వేడుకల్లో సందడి చేసిన పదేళ్ల ఏళ్ల బాలుడు విగతజీవిలా కనిపించడంతో విషాద వాతావరణం నెలకొంది.

కావాలనే కాల్చారా?.. ఇద్దరు అదుపులోకి.. 
సందడిగా సాగిన న్యూ ఇయర్ వేడుకల్లో తుపాకీ పేల్చింది ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా? ఎవరైనా కావాలనే కాల్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్న 14 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒకే రోజు రాత్రి ఈ రెండు ఘటనలు చోటుచేసుకున్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.