Crackers : ఇంటి ముందు టపాసులు కాల్చొద్దు అన్నందుకు దంపతులపై కత్తులతో దాడి, వెన్నులో వణుకు పుట్టించే వీడియో
Couple Attacked With Swords : ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టపాసులు కాల్చొద్దు అన్నందుకు కత్తితో దాడి చేసి చంపాలని చూడటం దారుణం అంటున్నారు.

Couple Attacked With Swords (Photo : Google)
దీపాల పండుగ దీపావళిని ప్రజలు అంతా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అంతా కలిసి టపాసులు కాల్చి ఎంజాయ్ చేశారు. అయితే దీపావళి పండుగ కొన్ని చోట్ల గొడవలకు దారితీసింది. ఘర్షణలకు కారణమైంది. ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్లారు. ఇంటి ముందు టపాసులు కాల్చొద్దు అన్నందుకు కొందరు యువకులు రెచ్చిపోయారు. కత్తులు, కర్రలతో దంపతులపై దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో జరిగింది.
రంజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూనగర్ లో కొందరు యువకులు పటాకులు కాలుస్తున్నారు. అయితే, తమ ఇంటి ముందు టపాసులు పేల్చవదని రాజేశ్ సోంకర్, ప్రీతి సోంకర్ దంపతులు యువకులను కోరారు. అంతే, ఆ యువకులు కోపంతో ఊగిపోయారు. టపాసులు కాల్చొద్దని చెప్పడానికి మీరెవరు అంటూ దంపతులతో గొడవకు దిగారు. చూస్తుండగానే గొడవ పెద్దదై పోయింది. యువకులు రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయారు. కర్రలతో దంపతులపై దాడి చేశారు. ఇంతలో ఓ యువకుడు కత్తి తీసుకుని వచ్చాడు. ఆ కత్తిని చేతిలోకి తీసుకున్న మరో యువకుడు దంపతులను చంపడానికి వారి మీదకు వెళ్లాడు. వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
Also Read : వణుకు పుట్టించే వీడియో.. రోడ్డుపై టపాసులు కాల్చుతున్న వారిని కారుతో గుద్దిపడేశాడు
ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో అని అంతా షాక్ అవుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టపాసులు కాల్చొద్దు అన్నందుకు కత్తితో దాడి చేసి చంపాలని చూడటం దారుణం అంటున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు స్థానికులు.
Also Read : హోటల్‌లో దారుణం.. మహిళపై లైంగిక దాడి, మద్యం తాగించి
#WATCH | #Jabalpur Couple Attacked With Swords And Sticks For Asking Men Not To Burst Crackers Outside Their Home #MadhyaPradesh pic.twitter.com/ftyqqwS9Q1
— Free Press Madhya Pradesh (@FreePressMP) November 14, 2023