Pocso Act Case On Murugha Mutt Sri shivamurthy : కర్ణాటక మురుగా మఠాధిపతి శ్రీ శివమూర్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగా శరణరు మీద లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన లింగాయత్ మఠం అధినేత బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలో కేసు నమోదు కావటం అందరిని నివ్వెరపరుస్తోంది. శ్రీ శివమూర్తిపై కర్ణాటక పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరు దళిత బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుతో పాటు మరో ఇద్దరి మీద ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు కావడం కర్ణాటకలో కలకలం రేపింది.

Pocso Act Case On Murugha Mutt Sri shivamurthy : కర్ణాటక మురుగా మఠాధిపతి శ్రీ శివమూర్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

pocso act case on murugha mutt seer sri shivamurthy

Updated On : August 29, 2022 / 1:15 PM IST

pocso act case on murugha mutt seer sri shivamurthy :  చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు మీద లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన లింగాయత్ మఠం అధినేత బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలో కేసు నమోదు కావటం అందరిని నివ్వెరపరుస్తోంది. శ్రీ శివమూర్తిపై కర్ణాటక పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరు దళిత బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుతో పాటు మరో ఇద్దరి మీద ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు కావడం కర్ణాటకలో కలకలం రేపింది. ఈకేసును నమోదు చేసిన మైసూరు పోలీసులు ఈకేసును చిత్రదుర్గ పోలీసులకు బదిలీ చేశారు.

దీంతో చిత్రదుర్గ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంట్లో భాగంగా లైంగిక వేధింపులకు గురి అయినవారు దళితవర్గానికి చెందిన బాలికలుగా గుర్తించారు. ఈరోజు (ఆగస్టు 29,2022) బాధిత బాలికల నుంచి చిత్రదుర్గ పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు. కర్ణాటకలోని ప్రముఖ మఠాలు, మఠాధిపతుల్లో డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు ఒక్కరు. తమ మీద స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇద్దరు దళిత బాలికలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు హాట్ టాపిక్ అయ్యింది. చాక్లెట్లు..పండ్లు ఇస్తామని చెప్పి శ్రీ శివమూర్తి బాలికను తన గదికి పిలిపించుకుని లైంగికంగా వేధిస్తున్నారని బాలికలు ఫిర్యాదులో నమోదు పేర్కొన్నారు.

కాగా ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీ శివమూర్తిని దర్శించుకుని సత్కరించిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలపై శివమూర్తి స్పందించారు. ఇది తనమీద జరుగుతున్న కుట్ర అని మఠానికి చెందినవారే ఈ కుట్రకు పాల్పడుతున్నారని కాలమే దానికి పరిష్కారం చూపుతుంది అని తెలిపారు. ఇటువంటి కుట్రలు..ఆరోపణలు తనమీదే కాదు సమాజాన్ని మార్చాలని యత్నించిన ఎంతోమంది మహానీయులపై కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. తనపై ఇటువంటి ఆరోపణలు వచ్చిన సమయంలో తనకు మద్దతు ఇచ్చేవారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

దీనిపై పోలీసులు మాట్లాడుతూ..బాలికలకు వైద్య పరీక్షలు చేయించి రిపోర్టులు వచ్చాక..రిపోర్టు్లో బాలికలు వేధింపులకు గురి అయినట్లుగా నిర్ధారణ అయితే శ్రీ శివమూర్తిని ఆరోపణలు ఎదుర్కొనే మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. బాలికలు దళిత వర్గానికి చెందినవారు కాబట్టి నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎంతోకాలంగా ఎంతో పేరుప్రతిష్టలు సంపాధించుకున్న చిత్రదుర్గాలోని మురుగా మఠం మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు ఇద్దరు అమ్మాయిల మీద పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ స్వచ్చంద సంస్థ నిర్వహకులు మైసూరులోని నజరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ ఇద్దరు అమ్మాయిల్లో ఓ అమ్మాయి మీద మూడు సంవత్సరాల నుంచి..మరో అమ్మాయి మీద 18 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు అమ్మాయిల మీద లైంగిక దాడి చెయ్యడానికి ఆ మఠంలోనే ఉంటున్న కొందరు సహకరించారని స్వచ్చంద సంస్థ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి ముద్దాయి కాగా రెండో ముద్దాయిగా వార్డెన్ రశ్మీ, మఠం మరిస్వామి అలియాస్ బసవాధిత్య, లాయర్ గంగాధరయయ, లీడర్ పరమశివయ్య స్వామీజీ ఆగడాలకు సహకరిస్తున్నారని, వారి మీద చర్యలు తీసుకోవాలని అమ్మాయిల తరపున స్వచ్చంద సంస్థ నిర్వహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సమాచారం.

కర్ణాటకలోని ప్రముఖ మఠాలు, మఠాధిపతుల్లో డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు ఒక్కరు కావడం విశేషం. చిత్రదుర్గాలోని మురుగా మఠానికి నిత్యం వేలాది మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. మఠం ఆధీనంలో అక్కమ్మదేవి విద్యాసంస్థలు ఉన్నాయి. తమ మీద స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇద్దరు అమ్మాయిలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు హాట్ టాపిక్ అయ్యింది. అయితే మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అంటూ కన్నడిగులు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.