Daughter Killed Father : అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు

జగిత్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు  వస్తున్నాడని తండ్రిని హతమార్చింది  కన్నకూతురు. 

Daughter Killed Father : అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు

Daughter Killed Father

Updated On : November 17, 2021 / 3:47 PM IST

Daughter Killed Father :  జగిత్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు  వస్తున్నాడని తండ్రిని హతమార్చింది  కన్నకూతురు.   వివరాల్లోకి వెళితే బీర్‌పూర్‌ మండలం తాళ్ల ధర్మారంలో    జెపెల్లి  నర్సయ్య(65) అనే వృద్దుడు ఇటీవల హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ  చేపట్టి  కేసులో నిందితులను అరెస్ట్‌ చేశారు.  నర్సయ్యను అతని కుమార్తె సత్తవ్వ   హత్య చేసినట్లు తేల్చారు.

Also Read : Tomato Price Hike : కిలో రూ.100 కి చేరిన టమాట ధర

నర్సయ్య కూతురు   సత్తవ్వ    బర్ల గంగాధర్   అనే వ్యక్తితో వివాహేతర సంబంధం  పెట్టుకుంది. అనంతరం ఆస్తిలో తన వాటా ఇవ్వమని తండ్రిని  కోరగా అందుకు తండ్రి నిరాకరించాడు. సత్తవ్వ  వ్యవహారం తెలుసుకున్న తండ్రి ఆమెను మందలించాడు.   వివాహేతర సంబంధం మానుకోమని కూతుర్ని హెచ్చరించాడు.

దీంతో ఆమె ప్రియుడు గంగాధర్ తో కలిసి తండ్రిని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఈనెల 11వ తేదీరాత్రి నిద్రపోతున్న నర్సయ్యను, కూతురు సత్తవ్వ కత్తితో మెడ కోసి బావిలో పడేయగా మొండాన్ని గంగాధర్ ఊరు చివర పొలాల్లో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు.