ఈ కూతుళ్లకు ఏమైంది : తెలంగాణలో కీర్తి రెడ్డి.. ఏపీలో భార్గవి..
మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్... ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే

మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్… ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే
మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్… ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే యమపాశమవుతుందని ఆ తల్లి కలలో కూడా అనుకోలేదు. కానీ భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కూతురు దారుణానికి ఒడిగట్టింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాక కటకటాలు లెక్కిస్తోంది.
గుంటూరులో మరో ఘోరం జరిగింది. హైదరాబాద్ హయత్ నగర్‌లో కీర్తి ఘటన మరువక ముందే గుంటూరు నగరం పాలెంలో భార్గవి అనే యువతి తల్లిని పొట్టనబెట్టుకున్న ఘటన కలవరపెడుతుంది. భర్త రామాంజనేయులు, బావ సాంబశివరావుతో కలిసి ఆస్తి కోసమే తల్లిని అతి కిరాతకంగా చంపేసింది భార్గవి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల దగ్గర నుండి 3 సెల్ ఫోన్లు , గోల్డ్ చైన్, 7 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నగరంపాలెంకు చెందిన ఆలపాటి లక్ష్మికి భర్త, కుమారుడు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. కుమార్తెను అచ్చంపేట మండలం పుట్లగూడెంకు చెందిన రామాంజనేయులుకు ఇచ్చి వివాహం చేసింది. అయితే ఆస్తి తన పేరుమీద రాయాలంటూ కొంత కాలంగా కూతురు భార్గవి తల్లిపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు… భార్గవికి బావ శివరావుతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అక్టోబర్ 10వ తేదీన భార్గవి తల్లి ఇంటికి వచ్చింది. ఆస్తి విషయమై తల్లితో గొడవపడింది.
లాభం లేదని మట్టుబెట్టాలని భావించింది. తన భర్త, బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచింది. లక్ష్మీ కాళ్లు, చేతులను భర్త, బాయ్‌ప్రెండ్ పట్టుకోగా.. సొంత కూతురే తల్లి గొంతును నులిమేసింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వదిలిపెట్టింది. అయితే… గుండెపోటు వచ్చిందంటూ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి నాటకమాటడింది. కానీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో హత్యే అని తేలింది.
భర్త రామాంజనేయులు, వివాహేతర సంబంధం ఉన్న బావతో కలిసి తల్లి లక్ష్మిని చంపేసినట్లు భార్గవి పోలీసుల ముందు ఒప్పుకుంది. లక్ష్మీకి ఉన్నది ఒక్క కూతురు భార్గవి. ఆమె తర్వాత ఆస్తి భార్గవికే దక్కుతుంది. కానీ… హత్య చేసి జైలుకెళ్లడంతో ఇప్పుడు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.