Bodhan BC Hostel Incident : డిగ్రీ విద్యార్థి ప్రాణం తీసిన గొడవ.. బీసీ వసతి గృహంలో దారుణం

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు విద్యార్థులతో పాటు వార్డెన్ స్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Bodhan BC Hostel Incident : డిగ్రీ విద్యార్థి ప్రాణం తీసిన గొడవ.. బీసీ వసతి గృహంలో దారుణం

Bodhan BC Hostel Incident Update

Updated On : March 4, 2024 / 5:09 PM IST

Bodhan BC Hostel Incident : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. తోటి విద్యార్థుల మధ్య గొడవ ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణం తీసింది. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు కలిసి దారుణంగా హత్య చేశారు.

బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థి వెంకట్ మరో ఆరుగురు విద్యార్థులతో గొడవ తలెత్తి కొట్టుకున్నారు. ఈ క్రమంలో వెంకట్ అనే విద్యార్థిని ఆరుగురు విద్యార్థులు గొంతు నులిమి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు విద్యార్థులతో పాటు వార్డెన్ స్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి గొడవ యువకుడి మరణానికి దారితీసిందన్నారు పోలీసులు. మృతుడు వెంకట్ ను గాంధారి మండలం తిప్పారం తండావాసిగా గుర్తించారు. వెంకట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడితో గొడవ పడ్డ విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు.

బీసీ హాస్టల్ లో విద్యార్థులు గొడవపడ్డారు. ఈ గొడవలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి వెంకట్ ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వెంకట్ మృతితో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థులు బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఈ గొడవలు పడటం, హత్యలు చేయడం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థుల మధ్య గొడవలో ఒకరి ప్రాణం పోయిందనే వార్త తోటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నింపింది. తమ పిల్లల క్షేమం పట్ల వారు కంగారుపడుతున్నారు. హాస్టల్ లో ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Also Read : రూ.12లక్షల కెమెరా కోసమే హత్య..! సంచలనం రేపిన విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి కేసులో వీడుతున్న మిస్టరీ