తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 02:36 PM IST
తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

Updated On : November 3, 2019 / 2:36 PM IST

ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపారు..ప్రస్తుతం ఆరోగ్యసరిస్థితి బాగానే ఉందన్నారు. హాస్పిటల్ పాలైన వారందరి మెడికల్ ఖర్చులు ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర వాహానం పార్కింగ్ చేసే విషయంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య చెలరేగిన వివాదం కొద్దిసేపటికే కాసేపటికి ఇది ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్పులు జరపటంతో వాతావరణం హీటెక్కింది. ఆందోళనకారులు ఒక పోలీసు వాహానానికి నిప్పు పెట్టారు.  పరిస్ధితి ఆందోళన కరంగా మారటంతో  పోలీసులు కోర్టు గేట్లకు తాళం వేశారు. ఘర్షణ జరగటంతో కోర్టు వద్దకు  భారీగా  పోలీసు బలగాలను తరలించారు. ఈ ఘర్షణలో మొత్తం 20మంది గాయాలపాలవగా,అందులోఇద్దరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు(SHO),ఓ అడిషనల్ కమిషనర్ కూడా ఉన్నారు. 9మంది న్యాయవాదులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన న్యాయవాదులను ఇవాళ హాస్పిటల్ కు వెళ్లి కేజ్రీవాల్ పరామర్శించారు. మరోవైపు ఈ విషయంలో ఆదివారం ఢిల్లీ హైకోర్టు రిటైర్ట్ హైకోర్టు జడ్జితో న్యాయవిచారణకు ఆదేశించింది. ఇద్దరు పోలీస్ అధికారులను బదిలీ చేసింది. ఢిల్లీలో లాయర్లపై దాడిని ఖండిస్తూ,వారికి మద్దతుగా హర్యానా,పంజాబ్ రాష్ట్రాల్లోని న్యాయవాదులు స్ట్రైక్ చేయనున్నట్లు ప్రకటించారు. బార్ అసోసియేషన్ కూడా లాయర్లపై దాడిని ఖండించింది. సోమవారం(నవంబర్-4,2019)ఢిల్లీలోని అన్ని జిల్లా కోర్టుల్లో ఒక రోజు స్ట్రైక్ కు పిలుపునిచ్చింది.